Site icon NTV Telugu

వైఎస్ షర్మిల ఆరో రోజు పాదయాత్ర.. కేసీఆర్ పాలనపై విమర్శల బాణాలు

రాష్ట్రంలో ప్రజలకు అనేక సమస్యలున్నాయిని తాను నిరూపిస్తే కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి దళితుడ్ని సీఎం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి సమస్యలు లేకపోతే నేను ముక్కు రాసి ఇంటికి వెళ్ళి పోతానని.. దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు. బంగారు తెలంగాణలో బడి పిల్లలు టాయిలెట్ పరిస్థితి ఇది.. సిగ్గు సిగ్గు..ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్ ఎందుకయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి..పరిపాలన చాతకాకపోతే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లనే పడుకోవాలన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో మోడీ ఇద్దరే కారణమన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, అందుకే ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు షర్మిల.

తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 6వ రోజుకి చేరుకుంది. మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు నుంచి ప్రారంభమైంది పాదయాత్ర. తుమ్మలూరులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైఎస్ షర్మిల. మొహబత్ నగర్ క్రాస్ తుమ్మలూరు గేట్ – రాచలూరు గేట్ మీదుగా పాదయాత్ర సాగింది.

అనంతరం కందుకూర్ మండలం బైరాగిగూడ లేముర్ క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది. లేముర్ గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. అగరమియాగూడ గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు వైఎస్ షర్మిల.మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. 3:30 గంటలకు లేమూర్ క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.

తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సోమవారం నాటికి పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలోమొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. 26 సమన్వయ కమిటీలు వైఎస్ షర్మిల కోసం పనిచేస్తున్నాయి. ఐదవ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసి సంఘీభావం ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version