NTV Telugu Site icon

YS Sharmila: నన్ను ప్రశ్నిస్తారా..? నేనే ఉల్టా మిమ్మల్ని ప్రశ్నిస్తా..

Ys Sharmila

Ys Sharmila

పాలమూరు ఎమ్మెల్యేలపై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఈ చేతకాని దద్దమ్మ లు నన్ను ఎదుర్కొనలేక నా మీద స్పీకర్ కి ఫిర్యాదు చేశారు.. ఒక మహిళ మీ అవినీతి మీద మాట్లాడితే… మీకు వణుకు పుడుతోంది అని ఎద్దేవా చేశారు.. మీకు దమ్ముంటే మీ నియోజక వర్గంలో డిబేట్ పెట్టండి.. పబ్లిక్ ఫోరం లో డిబేట్ పెట్టండి.. జర్నలిస్ట్ లను పిలుద్దాం.. ప్రతిపక్షాలను పిలుద్దాం.. మీరు రండి.. నేను వస్తాను.. మీరు చేసిన అభివృద్ధి మీరు చెప్పండి.. మీ అవినీతి గురించి నేను చెప్తా.. జనాల మధ్య మీకు దమ్ముంటే ఎదుర్కోవాలి అంటూ సవాల్‌ విసిరారు.. ఒక మహిళను అయి ఉండి నన్ను ఎదుర్కొనే దమ్ము లేక అందరూ కలిసి ఒక తాటి మీదకొచ్చారని మండిపడ్డ ఆమె.. స్పీకర్ గారికి ఎంటో తెలియక.. అవును అవును.. చర్యలు తీసుకోవాలి అని తలకాయ ఊపారట.. అసెంబ్లీ రమ్మంటరా… మీరు వస్తారా? అసెంబ్లీ లోపలకు రావాలా.. .బయటకు రావాలా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Read Also: Axis bank: వడ్డీ రేట్లు సవరించిన యాక్సిస్ బ్యాంక్.. వివరాలు ఇదిగో..

నన్ను ప్రశ్నిస్తారా.. నేనే ఉల్టా మిమ్మల్ని ప్రశ్నిస్తా అన్నారు వైఎస్‌ షర్మిల.. మీకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. మీకు భయపడే రకం కాదు. ఇక్కడ వైఎస్సార్ బిడ్డ.. పులిబిడ్డ అని వ్యాఖ్యానించిన ఆమె.. మీ దౌర్జ్యన్యాలు, అక్రమాలు, భూ కబ్జాలు గురించి ప్రశ్నిస్తా? పాదయాత్రలో ప్రజలే మీ బాగోతాలు అన్ని మాకు చెప్పారన్నారు.. మీకు దమ్ముంటే నన్ను పిలిపించండి.. నేను మంత్రి నిరంజన్ రెడ్డిని ఏం తప్పు అడిగిన.. నన్ను మరదలు అంటే చెప్పుతో కొడతా అని చెప్పా.. ఆయన కేసు పెడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు.. నేను కేసు పెడితే మాత్రం ఫైల్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇదేనా మహిళలకు ఉన్న గౌరవం.. నేను ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డను అయితేనే కేసు పెడితేనే తీసుకోవడం లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంటి..? ఇదేనా తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.