NTV Telugu Site icon

Y. S. Sharmila:రైతులదే తప్పని చెప్తున్నారా? వైఎస్ షర్మిళ కౌంట‌ర్‌

Sharmila

Sharmila

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా? అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. పంట లేటుగా వేస్తే.. గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెపుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు…. వరి వేస్తె ఉరే అని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు? అని ప్ర‌శ్నించారు. కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? అని అన్నారు.

వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు? అని సెటైర్ వేశారు. ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారు? ర‌ని ఎద్దేవ చేశారు. కాంటాలు పెట్టడం, టార్పాలిన్ కవరు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ… పంటలు లేట్ గా వేసుకొన్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసె పరిస్థితి వచ్చింది అని రైతులదే తప్పని చెప్తున్నారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వడ్లు పండించినందుకు రైతును దొషిని చేస్తున్నారా? అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు వై.ఎస్‌. ష‌ర్మిళ‌.

అయితే.. వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. 17 మే 2022 (మంగళవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం 2022 పంటల సాగుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరంజన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. సకాలంలో వరిపంట వేసుకుంటే అకాల వర్షాలతో నష్టాలు వచ్చేవి కావన్నారు. నవంబర్ లోనే సాగు ప్రారంభించిన రైతులు ఏప్రిల్ లోనే వరికోతలు పూర్తి చేసుకున్నారన్నారు. దీంతో ఎలాంటి నష్టంలేకుండా రైతులు లాభాలు పొందారని తెలిపారు.

ఎప్పుడైనా మే నెలలో అకాల వర్షాలు పడుతుంటాయని.. రాళ్ల వానలతో పంట నష్టం జరుగుతుందన్నారు. ఈదురుగాలులతో వచ్చే వర్షాలతో మామిడి తోటలు దెబ్బతింటాయన్నారు. కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా పంటలు వేయడంతో అకాల వర్షాలకు నష్టాలపాలవుతున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి.. వర్షాలను ఏమైనా సీఎం కేసీఆర్ చేయిపెట్టి ఆపగలరా అన్నారు. రాళ్లవానను ఆపగలరా.. ఈదురుగాలులతో వచ్చే వర్షాన్ని సీఎం కేసీఆర్ ఆపగలరా అని చెప్పుకొచ్చారు. 15 రోజులు ముందు వరిపంట వేస్కుంటే ఎలాంటి నష్టం ఉండదని.. లాభాలతో తెలంగాణ వ్యవసాయం ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు.

Big Breaking: రాజీవ్‌ గాంధీ హత్య కేసు.. సుప్రీం సంచలన తీర్పు