Site icon NTV Telugu

బంగారు తెలంగాణను..చావుల తెలంగాణ చేసారు : వైఎస్ ష‌ర్మిల‌

సీఎం కేసీఆర్ పై మ‌రోమారు వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణను… సీఎం కేసీఆర్‌ చావుల తెలంగాణ చేసాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికుల చావులు కేసీఆర్ పాల‌న మ‌న‌కు క‌నిపించాయ‌ని.. ఇప్పుడు సర్పంచ్ ల కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు ష‌ర్మిల‌.

చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యం అని రాష్ట్రంలోని సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిల‌. ధాన్యం కొనుగోళ్ల‌పై కూడా కేసీఆర్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. కొంటాడో కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతు గుండెలు ఆగిపోతుంటే సీఎం కేసీఆర్‌ మాత్రం ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రైతులు తిరగపడక ముందే పంట మొత్తం కొనాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్‌ మూట ముళ్ళె సర్దుకోవాల్సిందేన‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version