NTV Telugu Site icon

Shiva Sena Reddy: నోరు అదుపులో పెట్టుకోండి.. రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయి..

Shivareddy

Shivareddy

Shiva Sena Reddy: రానున్న రోజుల్లో నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణాలో మహిళలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 28 రోజుల్లో ప్రజలకు అందించిన సేవలను ప్రజలు నమ్మారన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు, అమరుల కుటుంబాలకు ఏం న్యాయం చేసిందన్నారు. రానున్న టీఎస్ ప్రక్షాళన కోసం కేంద్రంలో యూపీఎస్సి మా ప్రభుత్వం చేపడుతున్న చర్చలు చేస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు కళ్ళు కనిపించడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం 28 రోజుల ప్రగతి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పై శాఖల వారీగా మా ప్రభుత్వం సమీక్షలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చందుకు ఇంకా సమయం ఉండగా 31 మత్తు దిగనట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. గతంలో 70 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేసిన మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? అని ప్రశ్నించారు.

Read also: Chiru Venky: ఒకేరోజు… చిరు ఇక్కడ, వెంకీ అక్కడ!

అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాలనను పసికందు పాలన అన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. జూన్ 2 తేదీ వరకు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి మీ బిఆర్ఎస్ ప్రభుత్వనిది మర్చిపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణాలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని మీకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జీతాలను అందించిన ఘనత కనిపించడం లేదా? అన్నారు. వచ్చే నెల నుండి పెన్షన్ లను సైతం ప్రతి నెల 1 తేదీన అందిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. నష్టపోయిన ఆటో డ్రైవర్ లతో ప్రభుత్వం చర్చిస్తుంది వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు, కుట్రలు బిఆర్ఎస్ నాయకులు మానుకోవాలన్నారు. రానున్న రోజుల్లో నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణాలో మహిళలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్పు తో కొట్టే పరిస్థితులు వస్తాయన్నారు.
Janhvi Kapoor: సోషల్ మీడియా అంతా నీ జపంలోనే ఉంది… నువ్వేమో తిరుపతిలో ఉన్నావ్