NTV Telugu Site icon

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన యువకులు…

రాజేంద్రనగర్ సులేమాన్ నగర్ లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. విధులు నిర్వహిస్తున్న పోలీసుల పై దాడికి యత్నించారు పోకిరీలు. లాక్ డౌన్ టైమ్ అయిపోయినప్పటికి మాస్క్ లేకుండా హెల్మెట్ ధరించకుండా మోటర్ సైకిల్ పై వెళుతున్న యువకుడిని అడ్డగించిన పోలీసులు… ఎక్కడికి వెళుతున్నావని యువకుడిని ప్రశ్నించారు పోలీసులు. మా వాడి బండే ఆపుతావా అంటూ రోడ్డు పై వున్న బండరాయి తీసి కానిస్టేబుల్ పై దాడికి యత్నం చేశాడు. బండి తీసుకోవడానికి వెళ్లానని చెబితే వినరా అంటూ నానా బూతులు తిడుతూ… రాళ్లతో కొట్టి ఈ పోలీసులను చంపాలంటూ తిడుతూ పారిపోయాడు యువకుడు. ఈ తతంగం అంతా సెల్ ఫోన్ లో ‌చిత్రీకరించారు స్థానిక యువకులు.