తనకు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఒక యువ రైతు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఆత్మహత్యకు చేసుకుంటానని మంత్రి కేటీఆర్ కు రైతు శ్రీను ట్వీట్ చేశాడు. తాను ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగం లేకపోవడంతో తన భూమిలో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నానన్నాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండలలో తనకున్న 5 ఎకరాల భూమిని అధికారులు పల్లె వనం పేరుతో బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించారని రైతు అంటున్నాడు. తన భూమికి తనకివ్వాలని అధికారులను కోరినా స్పందించకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతివ్వాలని మంత్రి కేటీఆర్ కి 500 కి పైగా ట్వీట్లు చేశానంటున్నాడు.
మంత్రి కేటీఆర్ కు యువరైతు ట్వీట్ వైరల్
