Site icon NTV Telugu

Breaking: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్.. టీఆర్ఎస్ భారీ ర్యాలీ

Yashwanth Ktr Kcr

Yashwanth Ktr Kcr

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ .. టీఆర్‌ఎస్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుండి బైక్ ర్యాలీ మొదలైంది. బైక్ ర్యాలీలో యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్, కేటీఆర్‌ పాల్గొన్నారు.

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు దాదాపు ఐదు వేల మంది భారీ బైక్ ర్యాలీగా బయలు దేరారు. అయితే ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. ఈర్యాలీలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. భారీ ర్యాలీ నేపథ్యంలో ఒకే వాహనంలో యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్, ర్యాలీలో పాల్గొనడంతో టీఆర్ ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు.  అనంతరం రాత్రి బెంగుళూరుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హా.

Exit mobile version