Gutha Sukender Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు కేసీఆర్ అని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, గుడుల పట్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే ఈ ఆలయ నిర్మాణం సాధ్యమయింది.. ప్రభుత్వ నిధులతో 1800 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నారు. యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన రహదారులు వేయించారు.. విమాన గోపురం బంగారు తాపడం కోసం ఎందరో ధాతలతో మాట్లాడారు.. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఎందరో దాతలు బంగారం సమర్పించారు అని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Yadagirigutta: శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ విజేత..
ఇక, యాదగిరి గుట్టలో అద్భుతమైన కాటేజీలను సైతం కేసీఆర్ ఏర్పాటు చేశారు అని గుత్తా శాసన మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి చెప్పారు. యాదగిరి గుట్ట బోర్డుకి నిబద్ధత గల అధికారిని నియమించాలి.. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా యాదగిరిగుట్టకు అద్భుత పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని ఆయన పేర్కొన్నారు.