Site icon NTV Telugu

Beerla Ilaiah: గుట్కా తింటూ వంట చేస్తావా.. వంట మనిషిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం

Beerla Ilaiah

Beerla Ilaiah

Beerla Ilaiah: గురుకుల హాస్టల్లలో విద్యార్థులు పుడ్‌ పాయిజన్‌ ఘటనలు వెలుగులోకి రావడంతో అధికారులు దృష్టి సారించారు. స్థానికంగా ఫిర్యాదులు రావడంతో స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గురుకుల హాస్టల్‌లో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గురుకుల హాస్టల్ విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్‌ లో వసతులు, భోజనంపై ఆరా తీశారు. అయితే విద్యార్థులు చెప్పిన మాటలకు షాక్‌ తిన్నారు. వంట మనిషిపై ఫిర్యాదు చేశారు. గుట్కా, మద్యం సేవించి వంట చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీర్ల ఐలయ్య వంట మనిషి పిలిపించి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Lagacharla Industrial Park: లగచర్లలో పారిశ్రామిక పార్కు భూసేకరణకు నోటిఫికేషన్..

గుట్కా తింటూ వంట చేస్తావా హౌలే.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. వంట మనిషి గుట్కా నములుతూ వంట చేస్తున్నాడని సీరియస్‌ అయ్యారు. వంట చేసే వాళ్ళు శుభ్రంగా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. హాస్టల్ భోజనం ఏంటి ఇలా ఉంది.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట మనిషిని అక్కడ నుండి వెళ్లిపోవాలని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. విద్యార్దులు ఇబ్బందులు గురిచేస్తే సహించేది లేదని అన్నారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు.
OTS Scheme: నేటితో ముగియనున్న ఓటీఎస్ ఆఫర్.. రేపటి నుంచి బాదుడే

Exit mobile version