NTV Telugu Site icon

Fire Break: ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

Fire At Yadadri Ojo Fertilizer Industry

Fire At Yadadri Ojo Fertilizer Industry

Yadadri Fire Break: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలో ఉన్న ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలుస్తోంది. అర్ధరాత్రి ప్రమాదం జరగడం, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ పరిశ్రమలో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

Read also: Warangal Crime: ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై ప్రియుడు.. తల్లిదండ్రులు మృతి

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. శ్రీదత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. ఇదే కాంప్లెక్స్‌కు ఆనుకుని తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్ కూడా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దత్త సాయి కాంప్లెక్స్‌లో ఉన్న ఇద్దరిని సురక్షితంగా కిందికి దించారు చిక్కడపల్లి పోలీసులు. ముషీరాబాద్‌ నుంచి క్రాస్‌ రోడ్డుకు వచ్చే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉన్న రోగులను అధికారులు బయటకు పంపారు. ఇదే కాంప్లెక్‌లో ఫర్నీచర్‌ షోరూం కూడా ఉంది.  ఫర్నీచర్‌ షోరూంకు కూడా మంటలు అంటుకున్నాయి. దత్త సాయి కాంప్లెక్స్‌లోని 4వ అంతస్తులో ప్లాస్టిక్ గో డౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది.
Lava Blaze X 5G : అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చేస్తున్న బడ్జెట్ 5G లావా మొబైల్..