MLA Rajaiah Vs Sarpanch Navya: స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నవ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా సరైన ఆధారాలు సమర్పించలేదని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు సమర్పించకుంటే కేసును మూసేస్తామని నవ్య పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులు జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించారు. సర్పంచ్ నవ్య ఆరోపణలు అవాస్తవమని తేలడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదని జాతీయ మహిళా కమిషన్‌కు నివేదిక అందజేసింది. ఈ కేసు మలుపు తిరిగింది. నవ్య, రాజయ్య వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు పదిరోజుల క్రితమే చేపట్టాయి. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మహిళా కమిషన్ అధికారులు పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
తనను మానసికంగా వేధిస్తున్నారని ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఆమె భర్త ప్రవీణ్‌కుమార్‌తో పాటు అతని వర్గంలోని కొంతమందిపై సర్పంచ్ నవ్య కేసు పెట్టింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని నవ్య గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. గ్రామాభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఆ డబ్బును రాబట్టేందుకు ఎమ్మెల్యే రాజయ్య, ఆయన అనుచరులపై భర్త ప్రవీణ్ కుమార్ ఒత్తిడి తెస్తున్నారని, గతంలో తాను చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని అగ్రిమెంట్‌పై సంతకాలు చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు దృష్టి సారించడంతో సర్పంచ్ నవ్య వివాదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మేరకు పోలీసు కేసు పెట్టిన జానకీపురం సర్పంచ్ నవ్యకు కాజీపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఫోన్ రికార్డింగ్‌లు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు ఉంటే మూడు రోజుల్లోగా కాజీపేట ఏసీపీ కార్యాలయంలో సమర్పించాలని అందులో పేర్కొన్నారు. గడువు ముగిసినా సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. దీంతో జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లకు నివేదిక సమర్పించారు.