Bus Accident: రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని ఎల్లం బావి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి వున్న బస్సును వెనుకనుంచి అతి వేగంతో కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా ఇల్లందుకి చెందిన సతీష్ కుమార్, తేజ గా పోలీసులు గుర్తించారు. వారిద్దరి మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కంటైనర్ లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
Terror Threats In Mumbai: ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు.. అధికారులు అలర్ట్..!
Bus Accident: ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
- శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన కంటైనర్ లారీ..
- యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన..

Bus Accident