NTV Telugu Site icon

New Born Baby: తోకతో జన్మించిన శిశువు.. ఎక్కడో తెలుసా?

New Born Baby

New Born Baby

New Born Baby: యాదాద్రి భువనగిరి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుప్రతికి వచ్చిన ఓ యువతికి తోకతో మగ శిశువు జన్మించాడు. అయితే ఆపరేషన్ చేసేప్పుడు శిశువుకు తోక కనపించడంతో డాక్టర్లు షాక్ తిన్నారు. శిశువుకు సుమారు 15 సెంటీమీటర్ల పొడవు తోక కనిపించడంతో ఆశ్చరానికి గురైన వైద్యులు అతి కష్టం మీద శిశువును బయటకు తీశారు. ఇంతటి అపురూపమైన శిశువు జన్మించడంతో ఆస్పత్రి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Read also: Guntur Crime: వేధింపులతో బాలిక ఆత్మహత్య.. భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం..

యాదాద్రిలో మూడు నెలల మగ శిశువుకు వెన్నుముక లంబో సాక్రాల్ ప్రాంతంలో 15 సెంటీమీటర్ల తోకతో జన్మించారు. ముందు సంతోషం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు మునుముందు శిశుకు ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందిని భావించారు. దీంతో వైద్యులకు శిశువుకు తోక తొలగించాలని కోరారు. తోకతో పుట్టిన శిశువుకు బీబీనగర్ ఎయిమ్స్ పీడియాట్రిషన్ విభాగం వైద్యులు అరుదైన సర్జరీ చేసి తోకను తొలగించారు. జనవరి 2024లో ఆపరేషన్ జరగగా.. 6 నెలల పోస్ట్ ఆపరేషన్ ఫాలో అప్ తర్వాత ఎలాంటి నాడీ సంబందిత ఇబ్బందులు లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత సర్జరీ విషయాన్ని ఎయిమ్స్ వైద్యులు బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఈ సర్జరీ చేయడానికి రెండున్నర గంటల సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సర్జరీ తర్వాత శిశువును ఐదు రోజులు ఇన్ పేషెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఈ అరుదైన శాస్త్ర చికిత్స బృందంలో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు, ఒక సీనియర్ రెసిడెంట్ పాల్గొన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపారు..

Read also: Road Accident: ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు..?

ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు. శిశువు వెన్నుపాము సరిగా అభివృద్ధి చెందనప్పుడు పుట్టుకతో రకరకాల లోపాలు వస్తాయని డాక్టర్ అన్నారు. వెన్నుపాము దాని చుట్టూ ఉన్న కణజాలాలాలు అసాధారణంగా జతపడి తోక అభివృద్ధికి దారితీసే పరిస్థితి ఏర్పడి ఉంటుందని తెలిపారు. అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరి లోనూ కనిపించదని చెప్పారు. అయితే ఇలాంటి సమస్యలు వస్తే నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ అరుదైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Priya darshi: హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!