NTV Telugu Site icon

Yadadri: ఆన్‌లైన్‌లో యాదాద్రి ఆర్జిత పూజా టికెట్లు.. బుకింగ్ టైంలో ఇవి తప్పనిసరి

Yadadri Temple Pooja Tickets

Yadadri Temple Pooja Tickets

Yadadri: తెలంగాణలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రమైన యాదాద్రిని కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. దీంతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. తిరుమల దేవస్థానం తరహాలోనే స్వామివారి దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. రెండేళ్ల కిందటే ఈ విధానాన్ని ప్రారంభించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ ఏడాది జూన్ 22 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. దర్శనం మరియు ఆర్జిత పూజల ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతం YTDA ఆధ్వర్యంలో ECIL పర్యవేక్షణలో కొనసాగుతోంది.

Read also: 108 Employees: 108 ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు పెంచనున్న సర్కార్..

ఆన్‌లైన్ టిక్కెట్‌ను పొందడానికి..

ఈ ఆన్‌లైన్ సేవలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా స్వామివారి దర్శనం పొందవచ్చు. ఈ ఆన్‌లైన్ టిక్కెట్‌ను పొందడానికి yadadritemple.telangana. gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ అవ్వండి. ఇందులో నిజాభిషేక (ఇద్దరికి రూ.800, ఒకరికి రూ.400), సహస్రనామాచరణ రూ.300, శయోనోత్సవం రూ.100, స్వర్ణపుష్పార్చన రూ.600, సుప్రభాత దర్శనం రూ.100, దర్బారు సేవ రూ.516, అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం రూ.800, శ్రీ సుదర్శన నరసింహ హోమం రూ.1250, స్వామి వారి కల్యాణం రూ.1500, ద్విచక్ర వాహన పూజ రూ.300, ఆటో రూ.400, కారు రూ.600, లారీ, బస్సు, ట్రాక్టర్ రూ.1000, శాశ్వత నిత్య పూజ (10 సంవత్సరాలు) రూ.10 వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన (పదేళ్లు) రూ.15 వేలు, శాశ్వత నిత్య నిజాభిషేకం (పదేళ్లు) రూ.15 వేలు. రాత్రి బస చేసే భక్తుల కోసం కొండ కింద గదులు కేటాయించనున్నారు. లక్ష్మీ నిలయం నాన్ ఏసీ ధరలను రూ.560గా, లక్ష్మీ నిలయం నాన్ ఏసీ డీలక్స్ ధరలను రూ.1008గా నిర్ణయించారు.

Read also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

బుకింగ్ సమయంలో ఇవి తప్పనిసరి..

ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో, భక్తులు తమ పేరు, పూజ వివరాలు, గోత్రం, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, తేదీ, నెల, టిక్కెట్ల సంఖ్య మరియు చిరునామాను తప్పకుండా నింపాలి. ఐచ్ఛికంగా, నక్షత్రం, రాశి, ఆధార్ సంఖ్య, వయస్సు, ఆలయ సందర్శన వేళల వివరాలను ఇవ్వాలి. ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఆన్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి పరిమితం. లావాదేవీ ID లేదా మొబైల్ నంబర్‌ని ఉపయోగించి సేవా నివేదికలను కూడా ముద్రించవచ్చు.
తిరుమల మాదిరిగానే యాదాద్రిలోనూ బ్రేక్ దర్శనం అందుబాటులోకి వచ్చింది. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.300గా నిర్ణయించారు. కొనుగోలు చేసిన భక్తులను నేరుగా ఉత్తర రాజగోపురం గుండా ఆలయంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ దర్శన సౌకర్యం కల్పించారు. బ్రేక్ దర్శనంలో గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.150 శ్రీగ్రదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో కూడా పొందవచ్చని తెలిపారు.
Bahishkarana: ఈ లక్ష్మీ కూడా కంచెకి ఆవలే ఉంది…