Women Fight: తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఫ్రీ బస్ జర్నీ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిన్న చిన్న పనులకు కూడా మహిళలు బస్సునే ఆశ్రయిస్తున్నారు. ఇలా బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరగడంతో మహిళల మధ్య తగాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఒక్కో బస్సులో 80 శాతం మంది మహిళా ప్రయాణికులు ఉండడంతో అందరికీ సీట్లు దొరకడం కష్టంగా మారింది. పురుషుల పరిస్థితి చెప్పనవసరం లేదు. వందల కిలోమీటర్ల మేర నిలబడే వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే సీట్లు కోసం మహిళలు జట్టు పట్టుకుని కొట్టుకోవడం తరుచూ జరుగుతోంది. గతంలో నీళ్ల కోసం బిందెలు పెట్టి నా వంత కాదు నావంతు అంటు కొట్టుకోవడం మనం వినే ఉంటాం కానీ ఇప్పుడు బస్సు సీట్లుకోసం అదే ఫాలో అవుతున్నారు. ముందు సీట్ల కోసం జుట్టు పట్టుకున్నారు, మొన్న బట్టలు చింపుకున్నారు.. ఇప్పుడు జరిగింది అంతకు మించిందే అని చెప్పాలి. సీటు కోసం చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది.
Read also: Indian Aviation Industry : 2030 నాటికి 30కోట్లమంది ప్రయాణీకులు.. అర్జంట్ గా 2840 విమానాలు అవసరం
బస్సు సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వస్తుండగా సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. ముందు మాటా మాటా పెరిగింది.. ఆతరువాత ఆ గొడవ కాస్త కాళ్ల చొప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో.. చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు. మిగిలిన బస్సు ప్రయాణికులు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సీట్ల కోసం ఇంత పోరు అవసరమా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చూశారా సార్ అంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్‌లో పేరొన్నారు. మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీని వలన అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్ పిల్‌లో పేరొన్నారు.
Gold Price Today : మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
