Site icon NTV Telugu

Telangana Congress : కీలక పరిణామం.. ఆమెను పదవి నుంచి తొలగింపు

ఇటీవల గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బహిర్గతం కావడంతో పార్టీ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని క్రమ శిక్షణ చర్యల కింద కవితను ఆమె పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ పెద్దలు కృషి చేస్తుందన్న నేపథ్యంలో.. పార్టీలోని లుకలుకలు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారడంతో.. అధిష్టానం నిర్ణయాలు ఆ విషయం సర్దుమనిగింది. అయితే ఇప్పుడు మహిళా కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామం ఎక్కడకు వెళ్లి ఆగుతుందోనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

Exit mobile version