NTV Telugu Site icon

Mlc Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి నోటీసులు.. ఈనెల 21న విచారణకు హాజరుకావాలి లేదంటే..

Mlc Kaushik Reddy

Mlc Kaushik Reddy

Mlc Kaushik Reddy: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 14న జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు ఆదివారం నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు తమిళిసై గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. ఈనెల 21న ఉదయం 11:30 నిమిషాలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శాసనసభ, శాసనమండలి సభ్యులు ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళిసై ఎందుకు ఫైళ్లను క్లియర్ చేయలేదని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంటలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. కొన్ని బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లులను ఎందుకు దాచిపెడుతున్నారు.. గవర్నర్ ప్రవర్తన బాగా లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసింది.

Read also: Stalled Wedding: కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?

పీఎస్‌ లో ఫిర్యాదు..

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి గవర్నర్ పదవిని అవమానించారని, మహిళ అనే గౌరవం కూడా లేకుండా ఆ హోదాను కించపరిచేలా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ మొదలైంది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గత నెల చివర్లో కౌశిక్ రెడ్డిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా గవర్నర్‌ను అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదులు, ఆరోపణలు, మహిళా సంఘాల డిమాండ్లపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలపై కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. విచారణకు నేరుగా హాజరు కావాలని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని ఆదేశించారు.

కామెంట్లపై ఎమ్మెల్సీ క్లారిటీ..

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున హుజారాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థి తానేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ మంగళవారం కూడా స్పష్టత ఇచ్చారు. కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తే సహించేది లేదన్నారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని… అయితే గవర్నర్ తీరు వల్లే ఇలా స్పందించాల్సి వచ్చిందన్నారు. శాసనసభలో ఆమోదం పొందిన రాష్ట్రాభివృద్ధి బిల్లులపైనే తాను విమర్శించానని వివరించారు. అయితే దీనిపై కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చిన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంపై చర్చకు దారి తీస్తోంది. మరి ఈనెల 21న (రేపు) కౌశిక్ రెడ్డి హాజరవుతారా? అనే దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Online Betting Crime: విషాదం.. యువకుడ్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

Show comments