NTV Telugu Site icon

Pregnant Woman: రైలులో నిండు గర్బిని.. ట్రైన్ కదలడంతో నొప్పులు తరువాత..

Pregnant Woman

Pregnant Woman

Pregnant Woman: ఆమె నిండు గర్భిని, మహారాష్ట్రకు ట్రైన్‌ వెళ్లేందుకు సాహసించింది. ట్రైన్‌ లో ప్రయాణించేందుకు ధైర్యం చేసింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ట్రైన్‌ బయలు దేరేందుకు సిద్దమైంది. ఆమెది మహారాష్ట్ర కావడంతో.. అక్కడకు వెళ్లేందుకు కడుపులో బిడ్డవున్న రైలు ప్రయాదణించేందుకు సిద్దమైందని సమాచారం. ట్రైన్‌ హైదరాబాద్‌ నుంచి కదిలింది. అప్పటికే ఆమెకు కొంత నలతగా వున్నా పర్వాలేదులే అనుకుంది. కాస్త దూరం వెళ్లగానే పురిటినొప్పులు మొదలయ్యాయి. అక్కడ చూసిన ఆమెను చూసి చలించిపోయారు. ఏం చేయాలో కాసేపు అర్థంకాలేదు. కొందరు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలర్ట్‌ అయిన రైల్వేశాఖ ఆ అపార్ట్‌ మెంట్‌ లో చేరుకున్నారు. ఆమె పురిటి నొప్పులతో తల్లడిల్లుతుండటంతో.. అటు ఇటు బట్టలను కట్టేసారు. ఆ తల్లినికి సహకరించారు.

కదులుతున్న ట్రైన్‌ లో.. నొప్పులను భరించింది. చివరకు పండెంటి బిడ్డను కనింది. ఈ ఘటన హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న ట్రైన్‌లో చోటుచేసుకుంది. ఓ గర్భిణీ స్త్రీ కు పురిటి నొప్పులు రావడంతో వికారాబాద్ రాకముందే ట్రైన్ లోనే ఆడబిడ్డను జన్మనిచ్చింది. ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. గర్భిణీ వున్న బోగీకి చేరుకున్న రైల్వే పోలీసులు, అక్కడున్న అందరి సహకారంతో.. ఆమెకు ప్రసవం చేశారు. చివరకు పండెంటి బిడ్డను ఆమె నిచ్చింది. ఆ బిడ్డను ఒక రైల్వే మహిళ పోలీసు చేతిలో తీసుకుని ఆనందంతో చూస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. తరువాత రైల్వే పోలీసుల సహకారంతో వికారాబాద్ లో రైలు దిగి తల్లి బిడ్డను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రైల్వే మహిళ పోలీసులు తీసుకెళ్లారు.

ఇలాంటి ఘటనే సెప్టెంబర్‌ 14వ తేదీని ఓమహిళ, ఆమె భర్త సికింద్రాబాద్‌లో రైలు ఎక్కి తిరిగి విశాఖపట్నం వెళ్తున్నారు. అదే రైలులో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గీతం మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ డాక్టర్ స్వాతి కేసరి ఆ మహిళకు బిడ్డను ప్రసవించేందుకు సహకరించారు.. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు జరిగింది. ప్రసవ నొప్పితో బాధపడుతున్న తన భార్యకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. నేను మెడిసన్‌ చదువుతున్నానని అతనికి తెలియదు. అదే కంపార్ట్‌మెంట్‌లోని మరో ఇద్దరు మహిళలు, డ్యూటీలో ఉన్న పోలీసుల సహాయంతో, మహిళ ఉదయం 5:35 గంటలకు సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చిందని స్వాతి చెప్పారు.
Andhra Pradesh Crime: రూ.500 కోసం ప్రియుడి ప్రాణాలు తీసిన ప్రియురాలు..!