Site icon NTV Telugu

Hyderabad: మద్యం ప్రియులకు గమనిక.. రెండు రోజులు వైన్ షాపులు బంద్

Wine Shops Closed Min

Wine Shops Closed Min

హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. శ్రీరామనవమి వేడుకల కారణంగా రెండు రోజుల పాటు నగరంలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించుకునేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. దీంతో ముందు జాగ్రత్తగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని శ్రీరామనవమి శోభాయాత్ర ఎలాంటి ఆవాంతరాలు లేకుండా నిర్వహించేలా మద్యం షాపులను పోలీసులు బంద్ చేయాలని ఆదేశించారు. కాగా ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శ్రీరామనవమి శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు హైకోర్టు స్పష్టం చేసింది.

https://ntvtelugu.com/police-raid-on-illegal-money-lenders-homes-in-mahabubabad-district/

Exit mobile version