Site icon NTV Telugu

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా…?

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయక తప్పదు అంటున్నాయి ఉన్నత విద్యా మండలి వర్గాలు. ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక 15 రోజుల గడువు ఇచ్చి ఎంసెట్ నిర్వహిస్తాము అని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జులై 5 నుండి 9 వరకు ఎంసెట్ జరగాలి. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాకే డిగ్రీ తో ముడి పడి ఉన్న కామన్ ఎంట్రెన్స్ లు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఐసెట్ ఎంట్రెన్స్ ఆగస్ట్ 19,20 (3 సెషన్స్)…లా సెట్ ఆగస్ట్ 23(3 yrs,5 years llb, llm)…. ఎడ్ సెట్ ఆగస్టు 24,25 తేదీల్లో(3 సెషన్స్) జరగాలి. కనీసం షెడ్యూల్ కన్నా నెల రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే డిగ్రీ 5 వ సెమిస్టర్,6 వ సెమిస్టర్ పరీక్షలు ఒకే సారి నిర్వహించాలనే ఆలోచన ఉంది అని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. జూన్ 7 నుండి జరగాల్సిన పిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్స్ వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే జూన్ 12 న జరగాల్సిన పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్ వాయిదా పడ్డాయి. జులై ఒకటిన జరగాల్సిన ఈ సెట్..జూన్ 19 నుండి 22 వరకు జరగాల్సిన పీజీ ఈ సెట్ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Exit mobile version