NTV Telugu Site icon

Ponguleti: పొంగులేటి నోట సొంత పార్టీ మాట.. ఆఫర్లు నచ్చలేదా ?

Ponguleti

Ponguleti

Ponguleti: ఖమ్మం కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సొంత పార్టీ శ్రేణులు వినిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రైతు భరోసాయాత్ర నిర్వహిస్తున్న ఆయన కలెక్టరేట్‌ ఎదుట అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సొంత పార్టీ పెడతానని ఈ సందర్భంగా ప్రకటించారు. పొంగులేటి ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. ఎప్పటిలాగే అన్నాడా.. లేకుంటే నిజంగానే ప్లాన్ ఉందా అనే చర్చ సాగుతోంది.

Read also: Telangana martyrs memorial: రాజధానికి మరో మణిహారం.. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్

పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. పొంగులేటికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు భారీ ఆఫర్లు ఇచ్చాయి. పార్లమెంట్ స్థానంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో ఎనిమిది తన వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. కానీ పొంగులేటి ఏమీ మాట్లాడలేదు. అనంతరం బీజేపీ చేరికల కమిటీ కూడా ఆయనతో చర్చించింది. ఆ ఆఫర్స్ ఏంటో క్లారిటీ లేదు కానీ.. త్వరలోనే చెబుతామని ప్రకటించారు. సమయం పడుతుందని పొంగులేటి అన్నారు. మరోవైపు ఆయనకు ఆఫర్లు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారు. వారితో కూడా చర్చకు సిద్ధమన్నారు. కానీ పొంగులేటి మాత్రం రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి రాజకీయాలు చేస్తున్నారు. ప్రచారం ప్రారంభించారు. ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ అభ్యర్థులేనని అంటున్నారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు సొంత పార్టీ గురించి ఆలోచిస్తున్నాడు. అసలే సొంత పార్టీ అంతర్గత వ్యవహారమని… గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ పేరుతో ఓ పార్టీని ఇటీవల కొందరు రిజిస్టర్‌ చేశారు. ఆ పార్టీ వెనుక తెలంగాణ కీలక నేతలు ఉన్నారని అంటున్నారు. పొంగులేటి మరికొందరు అగ్రనేతలతో కలిసి టిఆర్ఎస్ పార్టీని స్థాపించబోతున్నారని ప్రచారం జరిగింది. బహుశా.. ఇలాంటి ఆలోచన వల్లే ఆయన నోటి నుంచి రాజకీయ పార్టీ అనే మాట వచ్చిందని భావిస్తున్నారు.
BJP Hindu Ekta yatra: లక్ష మందితో బీజేపీ ‘హిందూ ఏక్తా యాత్ర’.. బండి సంజయ్‌ పిలుపు