NTV Telugu Site icon

కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం… లాక్ డౌన్ విధిస్తారా? 

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది.  తెలంగాణ కేబినెట్ లో కీలక విషయాల గురించి చర్చించబోతున్నారు.  నైట్ కర్ఫ్యూ సమయంలో జరిగిన పరిణామాలు, కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ విధిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందులు తదితర విషయాల గురించి ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారు.  ఈనెల 13 వ తేదీన రంజాన్ కావడంతో రంజాన్ తరువాత నుంచి లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే విషయం మరికాసేపట్లోనే తేలిపోతుంది.  అటు హైకోర్టు కూడా కరోనా కేసులు, పరీక్షల విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.