NTV Telugu Site icon

Hyderabad: నగరం కేంద్రపాలిత ప్రాంతం కానుందా..? సోషల్ మీడియాలో జోరుగా చర్చ..!

Hyderabad

Hyderabad

Hyderabad: మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి రంగంలోకి దిగి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడారు. 2024 జూన్‌ నుంచి హైదరాబాద్‌ యూటీగా మారే అవకాశం ఉందని.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను మోదీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను యూటీ (కేంద్రపాలిత ప్రాంతం – కేంద్రపాలిత ప్రాంతం)గా మార్చనున్నారు.

నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైన సంగతి తెలిసిందే.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ యూటీ అవుతుందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ఈసారి ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా… పులి తోకలా తమదైన రీతిలో కథలు అల్లుతున్నారు. 2024 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లపాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు 2024 నాటికి పూర్తవుతుందని.. అందుకే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని కొందరు కొత్త లాజిక్కులు చెబుతున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్‌ను యూటీ చేసి తెలంగాణ ఇస్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయన హైదరాబాద్‌ను యూటీ చేయకపోవడానికి కారణం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

హైదరాబాద్ కు ఐటీ తీసుకొచ్చింది నేనే అంటూ కేటీఆర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ, బీఆర్‌ఎస్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే కారణం చంద్రబాబు అని టీడీపీ వాళ్లు అంటున్నారని.. మరి బీఆర్ఎస్ వాళ్లు ఐదేళ్లు గడిచినా అమరావతి ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు హైదరాబాద్ యూటీ అయితే.. మరో నగరం కట్టండి.. అప్పుడు మీకే తెలుస్తుంది.. అంటూ సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు పోస్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంది. అందుకే హైదరాబాద్‌ను యూటీ చేసి దేశానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దుతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ ప్రాంతంలో కూడా బీజేపీ బలపడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎంఐఎంను దెబ్బతీయడమే మోడీ ప్లాన్ అని కొందరు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.

ఒకవేళ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే.. కేంద్రం విధించే పన్నులే ఇక్కడ ఉంటాయి. రాష్ట్ర పన్నులు లేవు. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ నగరం. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌దే. అలాంటిది హైదరాబాద్‌ యూటీగా మారితే రాష్ట్రానికి భారీగా ఆదాయం పోతుంది. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రభావం పడుతుంది. హైదరాబాద్ ను యూటీ చేస్తే.. తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా..? ఇక్కడి నేతలు ఓకే చెబుతారా..? తెలంగాణకు కేంద్రం మరో కొత్త రాజధానిని నిర్మిస్తుందా..? హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటి వరకు చేసిన అప్పుల సంగతేంటి..? ఇదంతా మనకు తెలియదు కానీ, హైదరాబాద్ యూటీ అవుతుందనేది కొందరి వైఖరి. హైదరాబాద్‌ యూటీ దిశగా ఒక్క ప్రకటన వెలువడినా అది బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో లాభిస్తుంది. అంతే కాదు పోరాటాలకు మారుపేరైన తెలంగాణ సమాజం మరోసారి ఏకం అవుతుందనడంలో సందేహం లేదు.

Redmi Note 13 Pro Launch: వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన రెడ్‌మీ.. 200ఎంపీ కెమెరా, 5120 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Show comments