NTV Telugu Site icon

Wife Slapped Husband: భర్తను కరెంట్‌ పోల్‌ కు కట్టేసి చెప్పుతో కొట్టిన భార్య .. ఎందుకో తెలుసా?

Wife Slapped Husband

Wife Slapped Husband

The second married husband, the crushed wife: అక్రమ సంబంధాలు పెచ్చుమీరు తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పచ్చని జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాయి కొందరు. పెళ్లి చేకున్న కొద్ది రోజుల వరకే ఆనందంతో కాపురాలు సజావుగా సాగుతున్నాయి. ఆతరువాత ఏదో ఒక కారణంతో.. భర్తలు అక్రమ సంబంధాల ఊబిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వారి జీవితాలనే కాకుండా.. కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసుకుంటున్నారు. ఈఅక్రమ సంబందాలతో వారికి పుట్టిన పిల్లల జీవితం కూడా ప్రశ్నార్థకంగా మరుతోంది. క్షణిక సుఖం కోసం అన్యోన్యంగా వుండాల్సిన భార్య, భర్తల జీవితం అల్లకల్లోలంగా మారుతున్నాయి. తన భర్త రెండో వివాహం చేసుకున్నాడనే వార్తా ఆభార్యకు కుంగదీసింది. తనకు ఏం తక్కువ చేసాను. ఇప్పుడు నేను నాబిడ్డ ఏమైపోవాలన్న ప్రశ్నలు ఆమెకు ఎదురయ్యాయి. చివరకు ఆమెకు సహనం చచ్చిపోయింది. తన భర్తను కరెంట్‌ స్థంభానికి కట్టేసి చితక బాదింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షాకింగ్‌ ఘటన మంథనిలో చోటుచేసుకుంది.

నాలుగేళ్ల కిందట మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్‌ రెడ్డి వివాహం చేస్తున్నాడు. పెళ్లి సమయంలో అఖిల కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా కొడుకు జన్మించాడు. ఆతరువాత ఏమైందో ఏమో గానీ.. శ్రీకాంత్‌ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు. తన భర్త వస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూస్తున్న అఖిలకు ఒక్కసారి ఓ వార్త షాక్‌ తగిలింది. తన భర్త వరంగల్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని మరొకరితో తెలిసింది. ఈవిషయం తెలుసుకున్న అఖిల కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్‌ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. భర్త శ్రీకాంత్‌ను కరెంట్‌ పోల్‌కు కట్టేసారు. కోపంతో ఊగిపోయిన భార్య అఖిల భర్తను చితకబాదడమే కాకుండా.. చెప్పులతో కొట్టింది. అంతేకాకుండా.. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తనకు అన్యాయం జరిగిందని, తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని బోరున ఏడ్చింది. తన కొడుకు, తన పరిస్థితి ఏంటని న్యాయం కోసం పోరాడుతా అని, మొదటి భార్య వుండగా రెండో పెళ్లి ఎలా చేసుకున్నావని భర్తను నిలదీసింది. తనకు న్యాయం చేసేంత వరకు భర్తను వదలనని పట్టుబట్టింది. మరి అఖిలకు న్యాయం జరుగుతుందా లేదా ? అన్న విషయంపై నెటిజన్లకు ప్రశ్నార్థకంగా మారింది. మోసం చేసి మొదటి భార్య వున్నాకూడా బిడ్డపుట్టినా కూడా.. ఆదమరిచి రెండో పెళ్లి చేసుకున్న భర్త శ్రీకాంత్‌ ను కఠినంగా శిక్షించాలని ఇలాంటి పని మరొకరు చేయాలంటే భయపడేలా శిక్ష అమలు చేయాలని కోరుకుంటున్నారు స్థానికులు.
Cheetahs Release: కునో నేషనల్‌ పార్క్‌లోకి 8 చీతాలను విడుదల చేసిన ప్రధాని మోడీ