CM KCR: ఉద్యమ సమయంలో మహబూబాబాద్ వచ్చాను అప్పటి పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబాబాద్ లో.. దారుణమయిన కరువు ఉండేదని తెలిపారు. పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నారు సీఎం. వర్ధన్నపేట, పాలకుర్తిలో సగం పూర్తి అయిన కాలువలు చూసి ఈ జన్మలో నీళ్ళు రావనుకున్నాను కానీ..కురవి వీరభద్రుడికీ మొక్కుకున్నా అని అన్నారు. ఇవాళ మహబూబాబాద్ లో నూతన కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంటే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. కురవి స్వామి దయ, మానుకోట రాళ్ళ బలం వల్ల రాష్ట్రం సాకారమయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సర్పంచులు సంతోషపడేలా ప్రతీ పంచాయతీకి రూ.10లక్షలు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆనిధులపై పూర్తి అధికారం సర్పంచ్ లదే అన్నారు సీఎం.
Read also: Jaru Mitaya Song: ఏదో కామెడీ చేశాం కానీ.. ఈ “జారు మిఠాయ” సాంగ్ వెనుక ఇంత కథ ఉందా?
అయితే.. కేంద్రం అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని.. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు. ఇక.. మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ దేశ అభివృద్ధిపై యువకులు చర్చిచాలన్నారు. ఇక్కడి యువకులు ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. దీంతో.. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యనించిన కేసీఆర్ 20 ఏండ్లు గడిచినా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు రావటం లేదని ఆరోపించారు. ఇక మధ్నాహ్నం 2.55కు పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. మధ్నాహ్నం 3.20కి బహిరంగ సభ ముగించుకుని భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు 3.35 గంటలకు చేరుకుంటారు. అంతేకాకుండా.. పార్టీ ఆఫీసు ప్రారంభించిన తరువాత 4.05కి అక్కడి నుంచి బయలుదేరి కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4.30కి అక్కడి నుంచి ప్రయాణమై 5.30కి బేగంపేట ఎయిర్ పోర్టుకు తిరిగి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5.40 కి ప్రగతి భవన్‌కు చేరుకోవడంతో సీఎం పర్యటన ముగుస్తుంది.
అరెస్టుల పర్వం..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇవాళ సీఎం కేసీఆర్ మహబూబాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో.. జిల్లాలో పలు ఆదివాసి నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, వీఆర్ఏలు,విద్యార్థి సంఘాలు,సిద్ధం కావడంతో గూడూరు,గార్ల,చిన్న గూడూరు,కొత్తగూడ, నెల్లికుదురు, కేసముద్రం, కొరివి, మరికొన్ని మండలాల్లో నిరసన గళం వినిపించేందుకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఎటువంటి అవాంఛ సంఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికి అక్కడ అరెస్టులు చేస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పన ప్రకటన, పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నిర్మాణం తోపాటు పలు హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఇప్పటికే జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సీఎం పర్యటన ను అడ్డుకుంటారని నెపంతో ఎక్కడికి అక్కడ ఎవ్వరు దొరికితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే జిల్లాలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదుపులో తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.