Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్‌ 1 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

2. నేడు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ప్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై ఈ రోజు డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో సీఎం జగన్‌ మాట్లాడనున్నారు.

3. నేటి నుంచి మహిళల ఛాలెంజర్ టీ20 టోర్నీ ప్రారంభ కానుంది. ట్రయల్‌ బ్రేజర్స్‌, సూపర్‌ నోవాస్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.

4. నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌, శివప్రకాష్‌లు హజరుకానున్నారు.

5. నేడు, రేపు జపాన్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. తొలి రోజు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు మోడీ. రేపు క్వాడ్‌ నేతలతో మూడో శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు.

6. నేడు పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీతో నవనీత్‌ కౌర్‌ భేటీ కానుంది. తన అరెస్ట్‌పై పోలీసుల తీరును ప్రివిలేజ్‌ కమిటీకి వివరించనుంది.

Exit mobile version