NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

1. నేడు ఏపీలో కానిస్టేబుల్‌ ప్రాథమిక వ్రాత పరీక్ష. పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీస్‌ శాఖ. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ.

2. ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతన వైసీపీ కార్యాలయానికి శంఖుస్థాపన కార్యక్రమం.. హాజరుకానున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు.

3. విశాఖ: నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం… పారిశ్రామిక ప్రాంతమైన శ్రీహరిపురంలో వేడుకలు నిర్వహిస్తున్న బీజేపీ.. నగరంలో నివశిస్తున్న యూపీ వాసుల కోసం ఉత్సవాల ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా ఎంపీ మనోజ్ తివారీ, పాల్గొనున్న సోమువీర్రాజు, సునీల్ థియోధర్, ఎంపీ జీవీఎల్..

4. అనంతపురం : అనంత ఫిల్మ్ సొస్తెటీ ఆధ్వర్యంలో నేటి నుంచి లఘు చిత్ర వారోత్సవాలు.

5. నేడు నాగోబా జాతరకు కేంద్రమంత్రి అర్జున్‌ ముండా. ప్రత్యేక పూజలు చేయనున్న అర్జున్‌ ముండా, బండి సంజయ్‌.

6. నేడు హైదరాబాద్‌కు చెగువేరా కుమార్తె అలైదా గువేరా. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావసభ. సభకు హాజరుకానున్న అలైదా గువేరా.

7. వరంగల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేడు పర్యటించనున్న ఎమ్మెల్సీకవిత.. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం భూపాలపల్లి జిల్లాకు చేరుకొనున్న కవిత.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననుం ఎమ్మెల్సీ కవిత ..

Show comments