Whats Today updates 06.08.2022
1. నేడు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం జగన్ బయలుదేరుతారు. ఎల్లుండి నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారు.
2. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అంతేకాకుండా.. ఈ రోజే ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సీక్రెడ్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నారు.
3. నేడు తెలంగాణలో దోస్త్ తొలి విడత సీట్ల కేటాయింపు జరుగనుంది. రేపటి నుంచి ఈనెల 18 వరకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. 4,68,880 సీట్ల భర్తీకి విద్యామండలి కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.
4. ఏపీలో నేటి నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు 5.25 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
5. నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. అముదాలవలసలో స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.
6. నేడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు విరామం. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ పెద్దలను బండి సంజయ్ కలిసే అవకాశం ఉంది.
7. నేడు ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. మధ్యాహ్నం 12.25కి రాష్ట్రపతి ముర్మును చంద్రబాబు కలువనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో నేషనల్ కమిటీ భేటీలో చంద్రబాబు పాల్గొననున్నారు.
8. నేడు భారత్-వెస్టిండీస్ మధ్య నాల్గో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాత్రి 8 గంటలకు ఫ్లోరిడాలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1ఆధిక్యంలో భారత్ ఉంది.
