Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు మార్కుల రూపంలో ప్రకటించనున్న విద్యాశాఖ.

2. ఢిల్లీలో నేడు విజ్ఞాన్‌ భవన్‌లో ఐకానిక్‌ వీక్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఐకానిక్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ జరుగనున్నాయి.

3. నేడు తెలంగాణలో టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల చేయనున్నారు. జూన్‌ 12న టీఎస్‌ టెట్‌ 2022 పరీక్ష జరుగనుంది.

4. అమ్నీషియా పబ్‌ అత్యాచారం కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.

5. నేటితో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ ముగియనుంది. నేడు అనంతబాబును రాజమండ్రి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. అయితే కోర్టులో అనంతబాబు ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ను వేశారు.

6. నేడు నారాయణపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు 390 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

7. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,740లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,500లుగా ఉంది.

8. నేడు, రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడకు జేపీ నడ్డా చేరుకొనున్నారు.

Exit mobile version