Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు ఉదయం 11 గంటలకు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది.

2. నేడు ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

3. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీనియర్‌ నేత డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేడు హైదరాబాద్‌ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

4. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నేడు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

5. నేడు నరసరావుపేటకు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నిన్న ఘర్షణలో మృతి చెందిన జల్లయ్య అంత్యక్రియల్లో టీడీపీ నేతలు పాల్గొననున్నారు.

Exit mobile version