Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు గణపతి ఉత్సాల నిర్వహణపై సమావేశం. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు నవరాత్రి ఉత్సవాలు. మంత్రి తలసాని అధ్యక్షతన జరగనున్న సమావేశం. హాజరుకానున్న పలువురు మంత్రులు, అధికారులు.

2. ఢిల్లీ: కృష్ణభూమి దగ్గర నిర్మాణాలపై నేడు విచారణ. కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు. స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు. నేడు కేంద్ర పిటిషన్‌పై విచారణ జరపనున్న హైకోర్టు.

3. నేడు ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక నాణెం విడుదల. రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ. హాజరుకానున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. చంద్రబాబు, పురంధేశ్వరి, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు.

4. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 500 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.76,900 లుగా ఉంది.

5. నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న వైసీపీ, టీడీపీ. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు. మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబుకు అపాయిట్‌మెంట్‌, సాయంత్రం 4 గంటలకు కలవనున్న వైసీపీ నేతలు.

6. నేడు చిత్తూరు జిల్లా నగరిలో సీఎం జగన్‌ పర్యటన. జగనన్న విద్యాదీవెన సాయం, నేడు ఖాతాలో జమ. ఉదయం 10.15 గంటలకు నగరి చేరుకోనున్న సీఎం జగన్‌. క్లాక్‌టవర్‌ సెంటర్‌ నుంచి సభాస్థలి వరకు రోడ్‌ షో. తర్వాత జగనన్న విద్యాదీవెన ప్రారంభించనున్న సీఎం. బహిరంగ సభలో సంక్షేమ పథకాలపై ప్రసంగం. మధ్యాహ్నం 1.45గంటలకు రేణిగుంట తిరుగు ప్రయాణం.

7. తూర్పు గోదావరి జిల్లా : నేడు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి రాజమండ్రి రాక. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి, ఆర్ అండ్ బి. గెస్ట్ హౌస్ లో పాత్రికేయుల సమావేశం. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనున్న నందమూరి లక్ష్మీ పార్వతి.

8. రాజన్న సిరిసిల్ల జిల్లా : రెండవ శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు భక్తులు. స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం.

Exit mobile version