What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు భారత్‌- సౌతాఫ్రికా పైనల్‌ టీ20 మ్యాచ్‌ జరుగనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న ఇరు జట్లు.

2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.66,300లుగా ఉంది.

3. నేడు తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను బీజేపీ ప్రకటించనుంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను బండి సంజయ్‌ ప్రకటించనున్నారు.

4. అగ్నిపథ్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో నేడు నాంపల్లిలోని గాంధీభవన్‌ ముందు కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష కొనసాగనుంది.