Site icon NTV Telugu

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు వీఆర్‌ఏలతో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ. కేటీఆర్‌ నేతృత్వంలో వీఆర్‌ఏలతో చర్చించనున్న మంత్రులు జగదీష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్న సబ్‌ కమిటీ. సబ్‌ కమిటీ నివేదికపై చర్చించి తుది నిర్ణయం.

2. నేటి నుంచి భారత్‌, వెస్టిండీస్‌ మధ్య తొలి టెస్ట్‌. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

3. నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్‌ ఆందోళనలు. ఉచిత విద్యుత్‌ అవసరంలేదన్న కాంగ్రెస్‌ ప్రకటనపై నిరసన. గ్రామాల్లో కాంగ్రెస్‌ దిష్టిబొమ్మ దహనానికి పిలుపు.

4. నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల ధర్నా. సబ్‌స్టేషన్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయం. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్‌.

5. నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్‌. బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు. విద్యారంగ పరిష్కారించాలని డిమాండ్‌.

6. నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం. ఉదయం 10.30 గంటలకు ప్రధాని అధ్యక్షతన భేటీ. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చు.

7. నేడు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో జగన్‌ఫై దాడి కేసు విచారణ. నిందితుడి తరుపు వాదనలు విననున్న ఎన్‌ఐఏ కోర్టు.

8. నేటి నుంచి ఏపీలో ఫీవర్‌ సర్వే. ఇంటింటికి వెళ్లనున్న వైద్యశాఖ సిబ్బంది. డెంగ్యూ, మలేరియా వ్యాధులున్నవారి గుర్తింపు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు.

9. నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం. ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశం. SIPM ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్ట్‌లపై చర్చ.

10. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,410 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,100 లుగా ఉంది.

Exit mobile version