తెలంగాణలో వర్షాలు వదలడం లేదు. సోమవారం నుంచి వర్షాలు పడుతూనే వున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీ వరద ఉధృతికి శివారు ప్రాంతాలు మునిగిపోయాయి. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖతంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.
నిన్న రాజస్థాన్, పరిసర ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చ్ఛాట్టిస్ ఘడ్ మరియు ఆంధ్రప్రదేశ్ తీరం* వెంబడి ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖతం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది. . ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు చేసింది. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది, రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
Star Hero’s Remuneration: అగ్రహీరోల కీలక ప్రకటన.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని హామీ
ఇదిలా వుంటే అంబర్ పేట్ లోని మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పరిస్థితిని సమీక్షించారు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు. ఎగువ భాగం నుండి వస్తున్న వరదలతో తక్కువ ఎత్తు ఉండడంతో మూసారం బ్రిడ్జి మునుగుతుందన్నారు. దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు బ్రిడ్జ్ ప్రధాన రహదారి. ఈ బ్రిడ్జి పై ఫ్లై ఓవర్ తరహాలో హై లెవెల్ బ్రిడ్జి 52 కోట్లతో నిర్మిస్తాం. మరో రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే వెంకటేష్. ఉదయం బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడా బ్రిడ్జిపై వరద ప్రవాహం తగ్గింది.