Site icon NTV Telugu

Weather Report Telangana: అలర్ట్‌.. మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు

Weather Report Telangana

Weather Report Telangana

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్‌ తగలనుంది. తెలంగాణాకు రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఈ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉందన్నారు. దీంతో.. రానున్న 24గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని వాయువ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వివరించారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version