NTV Telugu Site icon

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న చలి.. ఐఎండీ వెల్లడి

Wether Telanga

Wether Telanga

Weather Latest Update: ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అల్పపీడన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు తెలంగాణ రాష్ట్రం, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 20.2 డిగ్రీలు. గాలి తేమ 84 శాతంగా నమోదైంది. ఇక.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసురుతుంది. సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడ్డాయి. కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ యూ లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్ జిల్లాలోని అర్లీటీలో 8.9కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిర్మల్ జిల్లాలోని పెంబి లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా నిల్వాయిలో 11.4 ఉష్ణోగ్రతలు నమోదైంది.

Read also: BJP MLA Ramana Reddy: సార్ మీకు సలామ్.. మాటకోసం సొంతింటినే కూల్చిసిన బీజేపీ ఎమ్మెల్యే

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో జోన్‌లో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రలోనూ పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Filmfare Awards 2024: జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్!