NTV Telugu Site icon

Severity of Cold: వణుకుతున్న తెలంగాణ.. పెరిగిన చలి తీవ్రత

Cold Wave

Cold Wave

Severity of Cold: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి పూట పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవుతుంది. తూర్పు ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున.. నేడు, రేపు మధ్యాహ్నం పొడివాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలిలో తేమ సాధారణం కన్నా.. అధికంగా ఉండటంతో ఇవాల తెల్లవారుజామున పొగమంచు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈశాఖ సూచించింది.

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి మరో 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ”హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది.. నగరంలో తెల్లవారుజామున పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. 6 నుంచి 8 వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు మరియు ఈశాన్యం నుండి కి.మీ.” అని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు ట్వీట్ చేశారు.

Read also:Astrology : డిసెంబర్‌ 22, గురువారం దినఫలాలు

జిల్లాలో చలి తీవ్రత:

సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్ జిల్లా టేక్మాల్ లో 13.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఉమ్మడి జిల్లా లో చలి తీవ్రంగా పెరిగింది. కొమురం భీం జిల్లా లో 10.4 గా కనిష్ట ఉష్ణోగ్ర లు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10.8గా నమోదైంది. ఇక నిర్మల్ జిల్లా లో 11.7 నమోదుకాగా.. మంచిర్యాల జిల్లా లో 12.7 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది.

నైరుతి బంగాళాఖాతం (తూర్పు భూమధ్యరేఖ ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని) కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం పశ్చిమ-నైరుతి దిశలో పయనించి శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీకే పరిమితం కానుందని వివరించారు.


Guinness Record: వీడు మామూలోడు కాదు.. గడ్డంతో గిన్నీస్ రికార్డ్