Ramesh Kumar BJP: వికారాబాద్ జిల్లాలో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గడిచిన ఎన్నికల్లోతాండూర్ లో మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చి సీఎం విస్మరించారని మండిపడ్డారు. వికారాబాద్ కు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికే తాండూరులో అధునాతన ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతంలో పూర్తి అయ్యేదని గుర్తు చేసారు. హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ పర్యటనను తాండూరు ప్రజలు అడ్డుకొని ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు.
read also: Independence Day 2022: మీకు తెలుసా..? ఇండియాతో పాటు ఆగస్టు 15న స్వాతంత్య్రం జరుపుకునే దేశాలు ఇవే..
అయితే.. ఆగస్టు 14న వికారాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభకు భారీగా జనాన్ని సమీకరించాలని స్థానిక యూనిట్లను నాయకత్వం కోరింది. అయితే.. ఆగస్టు 17న మేడ్చల్-మల్కాజిగిరిలో జరిగే మరో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈనేపథ్యంలో.. వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల తో పాటు టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించి, వికారాబాద్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆగస్టు నెలాఖరులో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, శంషాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఐసీసీ, టీఆర్‌ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు ముఖ్యమంత్రి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. రేపు వికారాబాద్ లో కేసీఆర్ పర్యటనను బీజేపీ నేతలు అడ్డుకుంటామనడంతో.. తీవ్ర దుమారం రేపుతోంది. మరి ఇన్ని పరిణామాల మధ్య కేసీఆర్ వికారాబాద్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది.
Godavari Floods: నిలకడగా గోదావరి.. కానీ,
