Site icon NTV Telugu

Break for Marriages: బ్యాచ్ లర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెళ్లి కావాలంటే 3 నెలలు ఆగాల్సిందే..

Marrige

Marrige

Break for Marriages: పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూసే బ్యాచ్ లర్స్ కు ఈ వార్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే లేట్ అయ్యింది త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహం చేసుకోవాలంటే ఇక 3 నెలల వరకు నో ఛాన్స్ అని పురోహితులు చెబుతున్నారు. మళ్లీ ఆగస్టు 8 తర్వాతే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుందని వెల్లడించారు. అయితే ఇప్పట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ పడింది. బ్యాచ్ లర్స్ జీవితానికి బాయ్ బాయ్ చెప్పే రోజులు పోవాలంటే ఆగస్టు 8 తర్వతే అంటున్నారు పురోహితులు. ఎందుకంటే.. ఇప్పుడు నేటితో మూఢం ప్రవేసించింది. మాఢం అంటే గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు.

Read also: Road Accident : సిగ్నల్ దగ్గర ఆగివున్న 10వాహనాలను ఢీకొట్టిన పాల ట్యాంకర్

అయితే.. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా.. శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. అయితే.. ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తుంటారు. కాగా.. ఈ సారి శుభకార్యాలు అశ్వయుజ మాసంలో మొదలయ్యాయి… ఒక్క పుష్యమాసంలో తప్ప మిగతా కార్తీకం, మాఘం, చైత్రమాసాలలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు భేషుగ్గా జరిగాయి . ఇక కొన్ని సందర్భాల్లో అయితే.. అత్యవసరం అనుకునేవారు వారికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ముహూర్తాలకు వెసులుబాటు తీసుకున్నారు. అయితే..ఈ నాలుగు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు తెలిపారు.

Read also: Ashu Reddy : రెడ్ డ్రెస్సులో హాట్ చిల్లీలా అషు రెడ్డి స్టిల్స్ ..

కాగా.. ఆ రోజుల్లో బ్రాహ్మణులు, ఇతర కులవృత్తులవారు, బంగారం వ్యాపారులు, ఫంక్షన్‌హాళ్ల యజమానులు, ట్యాక్సీలు, వస్త్రవ్యాపారులు… ఇలా పలువర్గాల వారికి చేతినిండా పనే అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధర పెరుగుతున్నా కొనుగోలుదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి అంటే ఇక బంగారం కొనాల్సిందే. ఇక ఇవాళ్టి నుంచి (శనివారం 27) నుంచి ప్రారంభమయ్యే మూఢం ఆగస్టు 8 వరకు కొనసాగనుంది. ఇక ఈ మూడు నెల్లలో వివాహాలు, పెళ్లిచూపులు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాల జోలికి వెళ్లరు. వివాహం కావాలంటే మళ్లీ ఆగస్టు 8వ తేదీ వరకు ఆగాల్సిందే మరి.. అప్పటి దాకా వీటిపై ఆధారపడిన బ్యాండు, వాయిద్య కళాకారులు, అలంకార నిపుణులు, టెంట్ హౌస్‌ నిర్వాహకులు, పూల అమ్మకందారులు, క్యాటరింగ్‌ నిర్వాహకులు తదితరులు కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిందే అని తెలుస్తుంది.
AP Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికల విధుల్లోకి అంగన్‌వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు

Exit mobile version