తెలంగాణ హైకోర్టులో కరోనా స్థతి గతులపై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 29న లక్ష పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన 10 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్స లైసెస్సులు రద్దు చేసినట్టుకు ప్రభుత్వం తెలిపింది. 79 ఆసుపత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రంలో 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిజేసింది. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్స్ కు కొరత ఉందని, కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కోనడాని సిద్దంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రజలకు అవసరమైన మందుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆరోగ్యశాఖ తెలిపింది.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నాం… ఆరోగ్యశాఖ
