NTV Telugu Site icon

Hyderabad Water: మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో నీళ్లు బంద్..

Hyderabad Water Suply

Hyderabad Water Suply

Hyderabad Water: నగరవాసులకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంజీర నీటి సరఫరా పంప్‌హౌస్‌ల మరమ్మతులు, సబ్‌ స్టేషన్లలో విద్యుత్‌ పునరుద్ధరణ పనుల కారణంగా వాటర్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. మంజీరా నీటి సరఫరా పంప్‌హౌస్‌ల మరమ్మతులు, సబ్‌ స్టేషన్లలో విద్యుత్‌ పునరుద్ధరణ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

Read also: Glowing Skin : మీకు మెరిసే చర్మం కావాలంటే.. ప్రతి రోజు రాత్రి ఈ టీ తాగండి

ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, కెపిహెచ్‌బి కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్‌ కాలనీ, వసంతనగర్‌, ఆర్‌సిపురం, అశోక్‌నగర్‌, జ్యోతి నగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, దీప్తిశ్రీనగర్‌, మదీనాగూడ, మియాపూర్‌, మంజీర ఫేజ్‌-1, బీరంగ్‌ బొల్ల, అమ్మీన్‌ పరిధిలోని ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ప్రకటనలో పేర్కొన్నారు. నీటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. కావున ప్రజలు సహకరించాలని సూచించారు. నీటి సరఫరా యదాతిదిగా సాయంత్రం సరఫరా అవుతుందని మరో అధికారి వెల్లడించారు. అయితే హైదరాబాద్ ప్రజలు మాత్రం అలర్ట్ గా ఉండాలని తెలిపారు. తాజాగా జనవరి 20న నగరంలోని పలు ప్రాంతాలకు24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ -1 మీరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ఏరియాలో మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు అధికారులు.
Sundeep Kishan: మరో రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్న సందీప్ కిషన్