గ్యాస్ సిలిండర్ ధరలు (LPG CYLINDERS) ఆకాశాన్నంటాయి. సామాన్యులకు అందనంత బరువుతో భారం మోపుతున్నాయి. సిలిండర్ ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు గ్యాస్ ఏజెన్సీ దళారులు నిండా ముంచేస్తున్నారు. అసలే ధరల మంటతో ఇబ్బంది పడుతుంటే.. గ్యాస్ సిలిండర్ లో వుండాల్సిన గ్యాస్ కి బదులు మరోటి వుంటే పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లేకుండా నీళ్ళు నింపేశారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి చూసిన వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఉదంతం బయటపడింది.
నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఏలే సలేశ్వరం మూడు నెలల క్రితం కల్వకుర్తి వారి శ్రీ లక్ష్మీనరసింహ గ్యాస్ ఏజెన్సీ (Gas Agency) ద్వారా సిలిండర్ ను కొనుగోలు చేశాడు..ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది.. సిలిండర్ బయటికి తీస్తున్న సమయంలో బాగా బరువు అనిపించింది..తూకం వేసి చూస్తే 15.5 కేజీల ఉండాల్సిన ఖాళీ సిలిండర్, మరో 7కేజీలు బరువుతో ఆ సిలిండర్ మెత్తం బరువు 22.5 కేజీలు ఉంది..అనుమానం వచ్చి రెగ్యులేటర్ అమర్చడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడినించి నీళ్లు రావడం గమనించి ఆశ్చర్యపోయాడు. ప్రతిసారి అతనికి మూడు నుండి నాలుగు నెలలు రావాల్సిన గ్యాస్ 45 రోజులకే అయిపోయిందని వాపోయాడు..గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ రాకేష్ కు ఫోన్ చేయగా అతను స్పందిస్తూ తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితుడు సలేశ్వరం తెలిపాడు. మరి ఈ గ్యాస్ సిలిండర్లోకి నీళ్ళు ఎలా వచ్చాయో గ్యాస్ ఏజెన్సీ వారికే తెలియాలి.
Central Government: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశాం.. పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం