Site icon NTV Telugu

KTR: త్వరలో వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు

Ktr2

Ktr2

50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో త్వరలో వార్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2021-22 ఏడాదికి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని , ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అన్ని పట్టణాల్లో టెన్‌ పాయింట్‌ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పోస్టు ఉందన్నారు. ఈడాది అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.

ఇండియాలో టాప్‌ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. పేదలకు ఆత్మగౌరవ గృహనిర్మాణం చేస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు అడగకున్నా ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న మున్సిపల్‌, పట్టణాభివృద్ధి అధికారులను అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్‌ సిబ్బంది బాగా పనిచేశారని, కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్‌ సిబ్బంది పాత్ర మరచిపోలేమని మంత్రి అన్నారు.

Andhra Pradesh: గ్రూప్-1 ఫలితాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్

Exit mobile version