జర్మనీలో ప్రమాదవశాత్తు నీటిలోపడి గల్లంతైన కడారి అఖిల్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే. నన్నపనేని నరేందర్. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. వరంగల్ నగరం కరీమాబాద్ కి చెందిన కడారి పరశు రాములు, అన్నమ్మల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం జెర్మనీ కి వెళ్ళాడు. అయితే, 5 రోజుల క్రితం జెర్మనీలో జరిగిన ప్రమాదంలో నీటిలో మిస్ అయ్యాడు. ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బుధవారం ఉదయం వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకున్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి సహాయక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వాళ్ళను ఓదార్చారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, ఆ కాలనీ వాసులు ఉన్నారు.
అయితే.. జర్మనీలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో గల్లంతైన తెలంగాణ విద్యార్థి ఆచూకీ కనిపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం రిక్వస్ట్ చేసింది. కేంద్ర విదేశాంగశాఖతో పాటు బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కెమికల్ ఇంజనీరింగ్ అయిన వరంగల్‌కు చెందిన కడారి అఖిల్(25) జర్మనీలో ఎంఎస్ చదివేందుకు 2018లో వెళ్లాడు. మే 8న జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. అప్పటి నుంచి అఖిల్ కోసం గాలిస్తున్నారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు అఖిల్ సోదరి. సాయం చేయాలని అభ్యర్థించింది. అఖిల్ సోదరి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. విషయాన్ని కేంద్రానికి తెలియజేసి అఖిల్ ఫ్యామిలీకి అండగా నిలబడాలని ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు మంత్రి కేటీఆర్. అఖిల్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా వుంటుందని పేర్కొన్నారు. దీంతో కేంద్రానికి, జర్మనీలోని భారత్ రాయబార కార్యాలయానికి సీఎస్ లెటర్ రాశారు.
VijayaSaiReddy: పేపర్ లీక్ చేస్తే ‘పద్మశ్రీ’ ఇవ్వాలా ఏంటి బాబూ..?