Medaram: ఆదివాసీలది విశిష్టమైన జీవన విధానం.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రకృతితో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు. ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది. తాజాగా.. మేడారం జాతర- 2024 తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నాడు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు.అదే రోజు పునుగొండ నుంచి పగిద్దరాజు, కొండాయి గ్రామానికి చెందిన గోవిందరాజులను అర్చకులు మేడారం గద్దలపైకి తీసుకువస్తారు. 22వ తేదీ గురువారం.. సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి.. 23వ శుక్రవారం వన దేవతలు గద్దెలపై కొలువుదీరుతారు. అమ్మవార్లను పొలాల్లో కొలువుదీరిన రోజు నుంచి కోట్లాది మంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు వస్తుంటారు. పసుపు కుంకుమ, ఎండు బియ్యం మరియు బంగారం (బెల్లం) సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలి ఇస్తారు. కోడి పుంజులు, మేకపోతులను బలి ఇస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులను గాలిలో ఎగవేసి ఆరగింపు చేస్తారు.
Read also: Chikoti Praveen: ఆ వార్తల వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నా తప్పేమీ లేదు
24వ తేదీ శనివారం.. సమ్మక్క, సారలమ్మ పగిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వానప్రస్వానికి చేరుకుంటారు. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు కొన్ని నెలల ముందు కూడా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వరకు చిరుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు.కానీ 1940 తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది. గిరిజనేతరులు కూడా జాతరకు రావడం ప్రారంభించారు. అప్పటి నుంచి మేడారంలో జాతర జరుగుతోంది.
BRS central office: ఢిల్లీలో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్