NTV Telugu Site icon

కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ కోసం నిధులు తీసుకురావడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో వరంగల్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ లు విరుచుకుపడ్డారు. రైల్వే లైన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం నిధులు విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలిద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఈ బడ్జెట్‌లో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీల అభివృద్ధికి తెలంగాణకు న్యాయం చేయకుంటే బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పర్యటించకుండా చేస్తామని హెచ్చరించారు. 11 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించగా, కుంటి సాకులు చూపుతూ పక్కన పెట్టారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.