NTV Telugu Site icon

Warangal Zoo Park: జుతువులను దత్తత తీసుకోండి.. పెంచుకోండి.. కాకతీయ జూపార్క్‌ ఆఫర్‌..

Warangal Zoo Park

Warangal Zoo Park

Warangal Zoo Park: వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డులో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జూలాజికల్ పార్కుగా పేరుగాంచింది. అయితే ఇప్పుడు వరంగల్‌లోని జూలాజికల్ పార్క్ జంతు ప్రేమికులకు ఆహ్వానం పలుకుతోంది. అంతే కాకుండా.. స్వయంగా పక్షుల ఆలన పాలన సంరక్షణ పాల్గొనాలనుకునే వారి కోసం జూలాజికల్ పార్క్ లోని పక్షులు, జంతువులను దత్తత తీసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. జూలాజికల్ పార్క్ 92 ఎకరాలలో విస్తరించి ఉంది, జంతువులు మరియు పక్షులు అనుకూలమైన వాతావరణంలో వృద్ధి చెందుతాయి. సంరక్షణ, నిర్వహణలో భాగస్వాములను చేసేందుకు జూ పార్క్ అధికారులు 2016 సంవత్సరం నుండి దత్తత స్కీంను ప్రారంభించారు.

Read also: Minister Seethakka: నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సీతక్క..

Read also: CM Revanth Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..

2016 నుంచి ఇప్పటి వరకు 90 మంది వివిధ జంతువులు, పక్షులను దత్తత తీసుకున్నారని.. దాతలను ముందుకు తీసుకొచ్చేందుకు జూ పార్కులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు రావాలని అధికారి మయూరి అభిప్రాయపడ్డారు. సంరక్షణ మరియు దత్తత ఎవరికి కావాలో బట్టి మూడు, ఆరు, సంవత్సరాలు చేయవచ్చు. చిరుతపులి, మొసలి, జంగిల్ క్యాట్, సాంబార్ జింక, మౌస్ డీర్, నెమలి, తెల్ల నెమలి, ప్రేమ పక్షులు, కాకాటిల్స్, క్రిష్ణ జింక, వైట్ రియా పక్షి, నక్షత్ర తాబేలు ఇలా 440 కి పైగా జంతు, పక్షి జాతులు సందర్శకుల సందర్శనార్థం అందుబాటులో ఉన్నాయి. జంతువులు, పక్షులను దత్తత తీసుకోవడానికి, వాటి నిర్వహణ మరియు సంరక్షణలో పాల్గొనడానికి కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, జంతు మరియు పక్షి ప్రేమికులు మరియు పౌరులను ఇది ఆహ్వానిస్తుంది.

Read also: Thangalan : తంగలాన్ ట్రైలర్…ముహూర్తం ఎప్పుడంటే..?

దత్తత తీసుకున్న వారిపై భారం పడకుండా అటవీశాఖ అధికారులు మూడు, ఆరు నెలలు, ఏడాది స్కీమ్ లు అందుబాటులోకి తెచ్చారు. అంతే కాకుండా దత్తత తీసుకున్న దాతల కుటుంబానికి ఏడాదికి రెండు లేదా మూడు సార్లు ఉచితంగా జూను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారిక జూలాజికల్ పార్క్ రేంజర్ మయూరి తెలిపారు. దత్తత తీసుకున్న పత్రాలను ఆదాయపు పన్నులో చూపవచ్చని మయూరి తెలిపారు. దత్తత తీసుకునే దాతలు తమ కాలపరిమితిని బట్టి జూలాజికల్ పార్క్ వరంగల్ పేరిట చెక్కు లేదా నగదు ఖాతాలో జమ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. పక్షులను దత్తత తీసుకోవాలనుకునే దాతలు 9440810093 జిల్లా అటవీ అధికారి హన్మకొండ, 8019919959 ఫారెస్ట్ రేంజర్ జూలాజికల్ పార్క్, 7780378972 సెక్షన్ ఆఫీసర్ జూలాజికల్ పార్క్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తలిపారు. లేదా www.kakatiyazoo వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని జూ పార్క్ రేంజర్ మయూరి తెలిపారు.
Actress Anandhi: విజయ్ సర్‌కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: తెలుగమ్మాయి ఆనంది