NTV Telugu Site icon

Warangal: మెడికల్ ఆఫీసర్ల నియామకాల అక్రమాలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ

Warangaldistrictmedicaloffi

Warangaldistrictmedicaloffi

వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ ఆఫీసర్ల నియామకాల్లో జరిగిన అక్రమలపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. పీహెచ్‌సీలో డెంటల్ వైద్యులు.. మెడికల్ ఆఫీసర్స్‌గా పనిచేయడంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గ్రూప్- 1 అధికారి ప్రేమ్‌కుమార్‌కి విచారణ బాధ్యతలు అప్పగించారు. పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న దంత వైద్యులను పిలిచి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: NKR 21 : కళ్యాణ్ రామ్.. ‘సన్నాఫ్ వైజయంతి’

వరంగల్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న దంత వైద్యులు ఎప్పుడు విధుల్లో చేరారు?, వారి నియామకాలు ఎలా జరిగాయి అనే అంశాలను ప్రేమ్ కుమార్ సేకరిస్తు్న్నారు. వారు ఉద్యోగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో చేరారా?, ఎవరు రిక్రూట్ చేసుకున్నారు. ఏ ప్రాతిపాదికన బీడీఎస్ చేసిన వారిని మెడికల్ ఆఫీసర్లుగా నియామకం జరిగింది?. వీరిలో ఎవరెవరూ పర్మినెంట్ అయ్యారు. నియామక సమయంలో వారి విద్యార్హతలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇలాంటి పలు అంశాల పైన ప్రేమ్ కుమార్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు ప్రేమ్ కుమార్ సమర్పించనున్నారు.

ఇది కూడా చదవండి: Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!