NTV Telugu Site icon

Konda Surekha: వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..

Konda Surekha

Konda Surekha

Konda Surekha: వరంగల్ లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిని‌ మంత్రి కొండా సురేఖ సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరును ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో కలిసి ఆస్పత్రిలోనీ పలు రికార్డులను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది షోకాజ్ నోటీసులు అందించాలని కలెక్టర్ కి సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నిలిచిన నీటిని చూసి తక్షణమే తిషేయాలని మంత్రి ఆదేశించారు.

Read also: Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..

లీకేజీలను మరమ్మత్తులు జరపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛదనం.. పచ్ఛదనం కార్యక్రమాన్ని మంత్రి సురేఖ ప్రారంభించారు. మరోవైపు వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం నుండి ఎంజీఎం కూడలి వరకు కార్పోరేషన్ సిబ్బంది, మహిళ సంఘాల ప్రతినిధులు , వివిధ శాఖల అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రి కొండా సురేఖ, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు మేయర్ సుధారాణి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు.
Madhyapradesh : నిత్య పెళ్లికూతురు.. ఆరుగురిని చేసుకుని ఏడో వాడితో పెళ్లికి రెడీ అయింది..కానీ

Show comments